నేడు తెలంగాణలో తేలిక పాటి వర్షాలు
- పలు జిల్లాల్లో కురిసే అవకాశం
- ఇటీవల అకాల వర్షాలకు భారీ నష్టం
- భారీ వర్షాలు ఇక కురియవన్న వాతావరణ శాఖ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు, వడగళ్ల ప్రభావం మాత్రం ఇక తగ్గిపోయినట్లేనని ప్రకటించింది.
నేడు మాత్రం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇటీవల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురియడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది.