‘టెస్లా ఎలాన్ మస్క్’కు మహారాష్ట్ర సైతం ఆహ్వానం

  • తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
  • సమస్యల పరిష్కారంలో సహకరిస్తాం
  • మంత్రి జయంత్ పాటిల్ ట్వీట్
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ ‘టెస్లా’ను ఆహ్వానించడంలో రాష్ట్రాల మధ్య పోటీ మొదలైంది. భారత్ మార్కెట్లో టెస్లా కార్లను ఎప్పుడు చూస్తామంటూ? ఒక యూజర్ ట్విట్టర్ లో వేసిన ప్రశ్నకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించడం తెలిసిందే. ఎన్నో సవాళ్లను పరిష్కరించుకోవాల్సి ఉందని, భారత ప్రభుత్వంతో ఎంతోకాలంగా సంప్రదింపులు చేస్తున్నట్టు మస్క్ నెటిజన్ కు రిప్లయ్ ఇచ్చారు.

దీంతో టెస్లా ప్లాంట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. ఎలాన్ మస్క్ ట్వీట్ కు దాన్ని జోడించారు. సవాళ్లను పరిష్కరించుకునే విషయంలో టెస్లాతో కలసి పనిచేసేందుకు సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు.

ఇప్పుడు మహారాష్ట్ర జలవనరుల మంత్రి జయంత్ పాటిల్ కూడా టెస్లాను ఆహ్వనించారు. ‘‘మహారాష్ట్ర ఎంతగానో పురోగమిస్తున్న రాష్ట్రం. భారత్ లో కార్యకలాపాలు ప్రారంభానికి వీలుగా అన్ని విధాల సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ పాటిల్ ట్వీట్ చేశారు. తయారీ ప్లాంట్ ను మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని కోరారు.


More Telugu News