ఏపీలో కరోనా నివారణపై అధికారులతో సీఎం జగన్ కీలక భేటీ
- కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష
- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచన
- రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలుపై చర్చ?
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో కొవిడ్ నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేసే అంశాలపై సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమీక్షలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో కేసులు విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.