'అశోకవనంలో అర్జున కల్యాణం' నుంచి లిరికల్ సాంగ్!
- విష్వక్సేన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్
- కథానాయికగా రుక్సార్
- సంగీత దర్శకుడిగా జై క్రిష్
- అనంత శ్రీరామ్ సాహిత్యం
విష్వక్ సేన్ కథానాయకుడిగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
జై క్రిష్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. 'మాటరాని మాయవా .. మాయజేయు మాటవా' అంటూ ఈ పాట మొదలవుతోంది. 'ఓ ఆడపిల్లా నువ్వు అర్థంగావా .. నా జీవితంతో ఆటాడతావా' అంటూ సాగుతుంది.
అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. బీట్ బావుంది .. అనంత శ్రీరామ్ తేలికైన పదాలనే వాడినా కాస్త ఆలోచనలో పడేస్తాయి. గతంలో రుక్సార్ ధిల్లోన్ రెండు మూడు తెలుగు సినిమాల్లో చేసింది. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.