కోహ్లీ సాధించబోయే విజయాలను ఓర్వలేకే.. : రవిశాస్త్రి సంచలన కామెంట్స్

  • కోహ్లీ మరో రెండేళ్లు టెస్ట్ కెప్టెన్ గా కొనసాగేవాడు
  • మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అవతరించేవాడు
  • ఏదేమైనా కోహ్లీ నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే
దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన వెంటనే ఆ ఫార్మాట్ కప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం సెన్సేషన్ క్రియేట్ చేసింది. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే... కోహ్లీ ఈ నిర్ణయానికి రావడానికి కారణమని కొందరు అంటున్నారు. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం చివరకు ఆయన కెరీర్ నే మార్చేసింది.

మరోవైపు కోహ్లీ గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ, టెస్టుల్లో కోహ్లీ మరో రెండేళ్ల పాటు కెప్టెన్ గా కొనసాగేవాడని చెప్పారు. వచ్చే రెండేళ్లు టీమిండియా స్వదేశంలోనే టెస్టులు ఆడబోతోందని... ఈ సిరీస్ లలో కెప్టెన్ గా కోహ్లీ ఘనమైన రికార్డులు సొంతం చేసుకునేవాడని... ఇప్పటికే 40 విజయాలు అందుకున్న కోహ్లీ... 50 నుంచి 60 టెస్టు విజయాలను అందుకుని మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అవతరించేవాడని తెలిపారు. అయితే కోహ్లీ సాధించే ఈ విజయాలను చూసి కొందరు ఓర్వలేకపోయేవారని వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందేనని అన్నారు.


More Telugu News