సోషల్ మీడియాలో కొత్త డ్యాన్స్ చాలెంజ్ ప్రారంభించిన తమన్నా

  • వరుణ్ తేజ్ 'గని' చిత్రంలో తమన్నా ఐటం సాంగ్
  • తన పాటలోని స్టెప్పులతో మిల్కీ బ్యూటీ డ్యాన్స్ చాలెంజ్
  • తర్వాతి వంతు మీదే అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
సోషల్ మీడియాలో కొత్త డ్యాన్స్ చాలెంజ్ ప్రారంభించిన తమన్నా
వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న 'గని' చిత్రంలో 'కొడితే' అనే ఐటం సాంగులో మిల్కీబ్యూటీ తమన్నా నటించింది. అయితే ఈ పాటలోని స్టెప్పులతో తమన్నా సోషల్ మీడియాలో కొత్తగా ఓ డ్యాన్స్ చాలెంజ్ ప్రారంభించింది. "ఎన్నెన్నో అవకాశాలు తీసుకోండి... డ్యాన్స్ చేస్తూనే ఉండండి... కొడితే బీట్ కు ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తున్నాను... తర్వాతి వంతు మీదే!" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తన డ్యాన్స్ చాలెంజ్ వీడియోను పంచుకుంది.

వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న 'గని' చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందించారు. కాగా, 'కొడితే' అంటూ సాగే హుషారైన గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.


More Telugu News