ఏపీలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 25,284 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 856 కొత్త కేసులు
- విజయనగరం జిల్లాలో 12 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 9 మంది మృతి
- ఇంకా 1,10,517 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 25,284 శాంపిల్స్ పరీక్షించగా... 5,879 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 823, కడప జిల్లాలో 776, కృష్ణా జిల్లాలో 650 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 12 కేసులను గుర్తించారు.
అదే సమయంలో 11,384 మంది ఆరోగ్యవంతులు కాగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,615కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,51,238 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,10,517 మందికి చికిత్స కొనసాగుతోంది.