'శేఖర్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
- విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'శేఖర్'
- మలయాళ 'జోసెఫ్'కి ఇది రీమేక్
- రాజశేఖర్ సరసన నాయికగా ముస్కాన్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో 'శేఖర్' సినిమా రూపొందింది. ఫస్టులుక్ తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి రాజశేఖర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ రోజున రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
'ఓ సన్నజాజి తీగలా అల్లుకోవే నన్నిలా .. కిన్నెరా .. ఓ కిన్నెరా, సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా' అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. మొదటిసారి వినగానే ఈ పాట మనసుకు పట్టేలా ఉంది.
మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'జోసెఫ్'కి ఈ సినిమా రీమేక్. ఒరిజినల్లో పాటలు ఉండవు .. కథ సీరియస్ గా నడుస్తుంది. కానీ తెలుగు నేటివిటీకి తగినట్టుగా కాస్త రొమాన్స్ ను జోడించినట్టుగా తెలుస్తోంది. రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో ఈ కథ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.