యూపీ రాజకీయాలకూ పాకిన ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి పాట ట్యూన్‌తో ప్రచార పాటను విడుదల చేసిన కాంగ్రెస్.. సోషల్ మీడియాలో వైరల్!
- ‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ అంటూ సాగే పాట
- యూపీ గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన వైనం
- ఉత్తరప్రదేశ్ వాసులమైనందుకు ఆనందంగా ఉందని కాంగ్రెస్ క్యాప్షన్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది. ఆ సినిమాలోని పాటలు, డ్యాన్స్‌లు, డైలాగులు అందరినీ వెర్రెక్కిస్తున్నాయి. క్రికెటర్ల నుంచి ప్రముఖల వరకు అందరూ వాటిని అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ ఫీవర్ రాజకీయాలకూ పాకింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ఓ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటలోని ట్యూన్‌ను పుష్ప సినిమాలోని ‘చూపే బంగారామాయేనే శ్రీవల్లి..’ సాంగ్ నుంచి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ (చాలా అందంగా ఉంటావు యూపీ..) అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.
ఈ పాటను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన యూపీ కాంగ్రెస్.. యూపీ వాసులమైనందుకు గర్వంగా ఉంది’ అన్న క్యాప్షన్ జోడించింది. యూపీలో ఈ నెల 10న తొలి విడతల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 410 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.