గుడివాడలో క్యాసినో వ్యవహారంపై ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు చేసిన రామ్మోహన్ నాయుడు
- క్యాసినోపై విచారణ జరపాలని కోరాం
- గోవా నుంచి యువతులను ఏపీకి తీసుకొచ్చారు
- క్యాసినో, విమాన టికెట్లకు సంబంధించిన పలు ఆధారాలు ఇచ్చాం
- 500 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సమయంలో క్యాసినో నిర్వహించడంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన తమ పార్టీ నేత ఆలపాటి రాజాతో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి క్యాసినో వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.
ఈడీ అధికారులను కలిసిన అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ... క్యాసినోపై విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. గోవా నుంచి యువతులను ఏపీకి తీసుకొచ్చారని చెప్పారు. ఈడీ విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటపడతాయని తెలిపారు. క్యాసినో, విమాన టికెట్లకు సంబంధించిన పలు ఆధారాలను ఈడీకి సమర్పించామని చెప్పారు. పేకాట, డ్రగ్స్, జూదం వంటి కార్యకలపాలతో 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆలపాటి రాజా ఆరోపించారు.