శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే

  • 14 మంది సభ్యులను నియమించిన సర్కారు
  • హైకోర్టును ఆశ్రయించిన శ్రీనివాసులు అనే వ్యక్తి
  • ఇది ఎస్టీలకు సంబంధించిన ఆలయం అని వెల్లడి
  • ట్రస్టు బోర్డులో గిరిజనులెవరూ లేరని ఆరోపణ
ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలం ట్రస్టు బోర్డుకు ఇటీవల ప్రభుత్వం 14 మంది సభ్యులను ప్రకటించింది. ఈ కొత్త సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డు ఫిబ్రవరి 14న ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. అయితే, ఈ ప్రమాణస్వీకారంపై ఏపీ హైకోర్టు నేడు స్టే మంజూరు చేసింది. శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకంపై శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఇది ఎస్టీలకు సంబంధించిన ఆలయం అని నివేదించారు. అయితే, నూతనంగా నియమించిన ట్రస్టు బోర్డు సభ్యుల్లో గిరిజనులు ఎవరూ లేరని పేర్కొన్నారు. పైగా, ఆలయంపై ఏమాత్రం అవగాహన లేనివారిని సభ్యులుగా నియమించారని వివరించారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో నిబంధనలు అనుసరించలేదని ఆరోపించారు. వాదనలు విన్న పిమ్మట హైకోర్టు ధర్మాసనం... ప్రమాణస్వీకారంపై 3 వారాల వరకు వర్తించేలా స్టే ఇచ్చింది.


More Telugu News