తెలంగాణలో మారనున్న డ్రైవింగ్ కార్డులు

  • కేంద్ర ప్రభుత్వ వాహన్ ప్రాజెక్టులో చేరిన తెలంగాణ
  • సికింద్రాబాద్ ఆర్టీఏ పరిధిలో సేవలు
  • వివరాలన్నింటినీ వాహన్ కు ఎక్కిస్తున్న అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహనాల రిజిస్ట్రేషన్ కార్డుల రూపురేఖలు మారిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘వాహన్’ పేరుతో రూపొందించిన పోర్టల్ లో తెలంగాణ సర్కారు కూడా చేరింది. ‘ఒకే దేశం ఒకటే కార్డు’ పేరుతో కేంద్ర సర్కారు దీన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దేశ ప్రజలందరికీ రవాణా సేవలను అందించనుంది.

కొత్త కార్డులో సమగ్ర వివరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో చేరడం వల్ల ఒక వాహనానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవచ్చు. వాహనం నంబర్ ఆధారంగా ఏ రాష్ట్రం, వాహనదారు, వాహనం వివరాలు తెలుస్తాయి. చోరీ, అసాంఘిక శక్తుల భారిన పడినా వెంటనే తెలుసుకోవచ్చు.

ముందు ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ ఆర్టీవో కార్యాలయాన్ని తెలంగాణ సర్కారు ‘వాహన్’ కోసం ఎంపిక చేసింది. ఈ ఆర్టీయే కార్యాలయం పరిధిలోని వాహనాలు, ఇతర సమాచారం అంతటినీ వాహన్ పోర్టల్ కు ఎక్కించే కార్యక్రమం నడుస్తోంది. ఇది విజయం సాధిస్తే క్రమంగా అన్ని రవాణా కార్యాలయాలకు దీన్ని విస్తరించే ఆలోచనతో ఉంది.


More Telugu News