"సవాంగ్ అన్నా' అని పిలిచారు... ఇప్పుడు కరివేపాకులా తీసిపారేశారు: వర్ల రామయ్య

  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన వర్ల
  • అధికారులను వాడుకుని వదిలేస్తారని విమర్శలు
  • సవాంగ్ విషయంలో అదే జరిగిందని వ్యాఖ్య  
  • అధికారులకు గుణపాఠం కావాలని హితవు
ఏపీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ను హఠాత్తుగా తొలగించడం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. అధికారులను జగన్ వాడి పారేసే విధానం మరోసారి బయటపడిందని విమర్శించారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ ప్రకాశ్, అజేయ కల్లం, పీవీ రమేశ్ వంటి ఐఏఎస్ లను కూడా వాడుకుని వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారి సవాంగ్ విషయంలోనూ అదే జరిగిందని వర్ల పేర్కొన్నారు.

"సవాంగ్ అన్నా' అంటూ పిలిచి కరివేపాకులా వాడుకుని వదిలేశారని విమర్శించారు. సవాంగ్ ఐపీసీ నిబంధనలు కూడా పక్కనబెట్టి జగన్ కోసం పనిచేశారని పేర్కొన్నారు. గౌతమ్ సవాంగ్ వ్యవహారం అధికారులకు గుణపాఠం కావాలని వర్ల రామయ్య హితవు పలికారు.


More Telugu News