బప్పీలహరిని బలితీసుకున్న అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా.. ఏమిటీ వ్యాధి?
- శ్వాస నాళాల ఎగువ భాగంలో అడ్డంకులు
- దాంతో గాలి సరిపడా అందని పరిస్థితి
- ఒక్కసారిగా పెద్ద శబ్దంతో శ్వాస తీసుకోవాల్సిన ఇబ్బంది
- దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి చేటు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు బప్పీలహరి అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) సమస్య కారణంగా గుండె ఆగిపోయి మరణించినట్టు వైద్యులు ప్రకటించిన సంగతి విదితమే. నిజానికి ఓఎస్ఏ గురించి ఎక్కువ మందికి తెలియదు. స్లీప్ అప్నియాలోనే పలు రకాలు ఉన్నాయి. వాటిల్లో ఓఎస్ఏ ఒకటి.
నిద్రిస్తున్న సమయంలో అప్పర్ ఎయిర్ వేస్ (శ్వాస తీసుకునే ఎగువ భాగంలో) బ్లాక్ కు గురి అవుతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని మరింత వ్యాకోచింపచేసి, గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపించేందుకు వీలుగా ఛాతీ కండరాలు బలంగా పనిచేస్తాయి. దీంతో పెద్ద జెర్కింగ్ చప్పుడుతో లేచి గాలి తీసుకుంటారు. ఈ సమస్య ఉన్న వారు మంచి నిద్ర పోలేరు. ఇది దీర్ఘకాలంలో వారి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఓఎస్ఏలో శ్వాసనాళాల ఎగువ భాగం అడ్డంకికి గురవుతుంది. గాలి సరిపడా అందకపోవడంతో లేచి గాలి తీసుకోవాలంటూ మెదడు అదే పనిగా సంకేతాలు ఇస్తుంటుంది. కానీ, స్లీప్ అప్నియా లేదా సెంట్రల్ స్లీప్ అప్నియాలో మెదడు సంకేతాలు ఇవ్వలేదు. దీంతో మధ్య మధ్యలో శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది.
శ్వాసనాళ కండరాలు మూసుకుపోవడం వల్ల ఓఎస్ఏ సమస్య ఏర్పడుతుంది. నిద్ర సమయంలో గొంతు భాగంలో సాఫ్ట్ టిష్యూ వ్యాకోచించడం వల్ల గాలి వెళ్లే మార్గానికి అడ్డుపడుతుంది. స్థూలకాయం, టాన్సిల్స్ వాపునకు గురికావడం, ఎండోక్రైన్ డిజార్డర్లు, గుండె విఫలం కావడం వంటి సమస్యలున్న వారికి ఓఎస్ఏ ఎదురవుతుంది. పెద్దగా గురకపెట్టడం స్లీప్ అప్నియాకు సంకేతంగా చూడాలి. పగటి పూట ఎక్కువ నిద్ర పోవడం కూడా సమస్యకు దారితీస్తుంది.
దీనికి పరిష్కారంగా ఒక పరికరాన్ని వైద్యులు సూచించిస్తుంటారు. దీన్ని తలకు ధరించి పడుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజర్ ను పంపిస్తుంది. దాంతో అవి తెరచుకుంటాయి. దీనివల్ల గురక రాకుండా, శ్వాసకు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోవచ్చు. దీనికి శస్త్రచికిత్స కూడా ఉంది. బరువు తగ్గించుకోవడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. స్లీప్ అప్నియా బాధితుల జీవిత కాలం 12-15 ఏళ్లపాటు తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం మంచిది.