ఏపీ సినిమా థియేటర్లలో ఇక 100 శాతం సీటింగ్ కు ప్రభుత్వం అనుమతి

  • ఏపీలో తగ్గిన కరోనా ఉద్ధృతి
  • ఆంక్షలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం
  • థియేటర్ల యాజమాన్యాలకు ఊరట
  • కరోనా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వం సినిమా రంగానికి ఊరట కలిగించేలా మరో నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రేక్షకులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

టాలీవుడ్ నుంచి ఈ వేసవిలో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న తరుణంలో ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. ఫిబ్రవరి 25న పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్', వరుణ్ తేజ్ 'గని' చిత్రాలు వస్తున్నాయి. ఆపై, 'సర్కారు వారి పాట', 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి భారీ చిత్రాలు కూడా ప్రేక్షకుల మందుకు రానున్నాయి. 


More Telugu News