దీనిపై సర్కారు పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా స్పందించడంలేదు: నారా లోకేశ్

  • క‌ళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదనుకుంటుంది పిల్లి
  • దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు
  • ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు మంత్రి మేక‌పాటి  
  • ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందమ‌న్న లోకేశ్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దుబాయ్ ఎక్స్ పో వేదిక‌గా ఖాళీ కుర్చీల‌తో ఏపీ మంత్రి మేక‌పాటి గౌతమ్ ఎంవోయూ కుదుర్చుకున్నారంటూ ఆయ‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై లోకేశ్ మ‌రోసారి స్పందిస్తూ తాము బ‌య‌ట‌పెట్టిన విష‌యాల గురించి వైసీపీ నేత‌లు స్పందించ‌ట్లేద‌ని అన్నారు.

'క‌ళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టు... దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు గౌరవ మంత్రి మేక‌పాటి గౌతం గారు.

ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందాన్ని, 3 లక్షల రూపాయ‌లు కూడా లేని కంపెనీ పెడతామన్న 3 వేల కోట్ల రూపాయ‌ల‌ పెట్టుబడి లోగుట్టుని టీడీపీ బయటపెట్టింది. మంత్రి, సర్కారు పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా స్పందించడంలేదు' అని నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News