ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ... తల్లి జన్మదినం సందర్భంగా ఫొటో పంచుకున్న రామ్ చరణ్

  • నేడు కొణిదెల సురేఖ పుట్టినరోజు
  • తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
  • తల్లిలా తననెవ్వరూ అర్థం చేసుకోలేరని కామెంట్
మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో సురేఖకు చెరోవైపున చిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారు. ట్విట్టర్ లో ఈ పిక్ పంచుకున్న రామ్ చరణ్... "నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు... హ్యాపీ బర్త్ డే మా" అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు.


More Telugu News