ఓ వైపు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు.. మ‌రోవైపు సోనియా గాంధీ త్వ‌ర‌లో ప్ర‌తిప‌క్ష‌ పార్టీల‌తో భేటీ

  • ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు
  • వాటి ఫ‌లితాల అనంత‌రం స‌మావేశం
  • 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు చ‌ర్చ‌లు
దేశంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడ‌గ‌ట్టి బీజేపీపై పోరాడ‌డానికి ఓ వైపు కేసీఆర్ ఈ రోజు ముంబై వెళ్లిన విష‌యం తెలిసిందే. యూపీఏయేత‌ర పార్టీల‌తో కూట‌మి ఏర్పాటు చేయ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ ఏకం చేయాల‌న్న ల‌క్ష్యంతోనే ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో ఏయే అంశాల‌పై చ‌ర్చించాల‌న్న విష‌యాల‌ను సోనియా గాంధీ ఇప్ప‌టికే సిద్ధం చేసుకున్నారు. ఈ స‌మావేశానికి ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కూడా ఆహ్వానించ‌నున్నారు.


More Telugu News