మెగాస్టార్ మూవీలో విలన్ గా చేయడమంటే కష్టమే: కార్తికేయ

  • హీరోగా కార్తికేయకి మంచి క్రేజ్
  • 'వలిమై'లో పవర్ఫుల్ విలనిజం
  • ఈ నెల 24వ తేదీన విడుదల
  • చిరూ సినిమాలో ఛాన్స్ కోసం వెయిటింగ్  
తెలుగులో హీరోగా తనని తాను నిరూపించుకుంటూనే తమిళంలో 'వలిమై' సినిమాతో తన విలనిజాన్ని చూపించడానికి కార్తికేయ రెడీ అవుతున్నాడు. అజిత్ హీరోగా రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడాడు.

''చిరంజీవి సినిమాలో విలన్ రోల్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా"? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ .. "మెగాస్టార్ సినిమాలో విలన్ గా చేయగలుగుతానా లేదా అనేది నా డౌటు. విలన్ గా అంటే ఆయనకి ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పవలసి ఉంటుంది. ఆయనను చూడగానే నేను కిందా మీదా అవుతాను. ఇక పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఎక్కడ ఉంటుంది?

ఒక విలన్ గా ఆయన మీదికి వెళ్లడమనే ఆలోచన చేస్తేనే టెన్షన్ గా ఉంటుంది. విలన్ గా కాకపోయినా ఆయన సినిమాలో ఒక మంచి రోల్ చేయాలని ఉంది. నా అభిమాన హీరోతో ఒక సినిమా చేశాను అనే సంతోషం .. మంచి రోల్ చేశాననే సంతృప్తి నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అలాంటి ఒక అవకాశం కోసం నేను ఎదురుచూస్తూనే ఉంటాను" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News