ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిని ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెనక్కి తీసుకురానున్న భారత్!
- ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు
- పొరుగు దేశాలకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తామని తెలిపిన విదేశాంగ శాఖ
- ఉక్రెయిన్ బోర్డర్ పాయింట్ వివరాలను వెల్లడించిన ఎంఈవో
ఉక్రెయిన్ పై రష్యా దాడి తీవ్ర రూపం దాల్చింది. రెండో రోజు సైతం పెద్ద స్థాయిలో రష్యా విరుచుకుపడుతోంది. నిన్న రాత్రి కూడా దాడులు కొనసాగాయి. రష్యా దాడుల్లో పలు నగరాలు దెబ్బతింటున్నాయి. పలు ప్రాంతాలు శ్మశానాలను తలపిస్తున్నాయి.
మరోవైపు అక్కడ ఉంటున్న భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఉక్రెయిన్ నుంచి బయటపడే మార్గంలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. రష్యా ఎయిర్ స్ట్రయిక్స్ నేపథ్యంలో గగనతలంపై ఉక్రెయిన్ ఆంక్షలు విధించింది. దీంతో, అక్కడ ఉన్న మన వారిని తీసుకురావడానికి మన విమానాలు అక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై భారత్ దృష్టి సారించింది.
ఉక్రెయిన్ నుంచి వాయు మార్గాల ద్వారా ప్రజలను తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో, వారిని సరిహద్దులకు తరలించి, పొరుగు దేశాల నుంచి విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. హంగరీ, పోలాండ్, స్లొవేకియా, రొమేనియాలు ఉక్రెయిన్ తో సరిహద్దులను పంచుకుంటున్నాయి.
ఈ దేశాలకు మన వారిని తరలించి, అక్కడి నుంచి ఎయిరిండియా విమానాల ద్వారా స్వదేశాలకు తీసుకురానున్నారు. బెలారస్ కూడా ఉక్రెయిన్ కు ఆనుకుని ఉన్నప్పటికీ... ఆ దేశానికి మన వారిని తరలించే అవకాశం లేదు. ఎందుకంటే బెలారస్ గుండా కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్-బెలారస్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
ఉక్రెయిన్ ను వీడి రావాలనుకునే వారు వారికి సమీపంలో ఉన్న బోర్డర్ పాయింట్లను సంప్రదించాలని విదేశాంగ శాఖ సూచింది. కీవ్ లోని ఇండియన్ ఎంబసీ 24 గంటలూ పని చేస్తుందని తెలిపింది.
ఉక్రెయిన్ బోర్డర్ పాయింట్ నెంబర్లు ఇవే:
Zahony border post opposite Uzhhorod in Zakarpattia Oblast of Ukraine
Krakowiec land border with Ukraine
Vysne Nemecke land border with Ukraine
Suceava land border with Ukraine

Ankur (Mobile and Whatsapp: 36308644597)
S Ramji, (Mobile: 36305199944, Whatsapp: 917395983990)
Mohit Nagpal (Mobile: 36302286566, Whatsapp: 918950493059)
S Ramji, (Mobile: 36305199944, Whatsapp: 917395983990)
Mohit Nagpal (Mobile: 36302286566, Whatsapp: 918950493059)
Krakowiec land border with Ukraine
Manoj Kumar (Mobile: 421908025212)
Pankaj Garg (Mobile: 48660460814 / 48606700105)
Pankaj Garg (Mobile: 48660460814 / 48606700105)
Vysne Nemecke land border with Ukraine
Ivan Kozinka (Mobile: 421908458724)
Suceava land border with Ukraine
Andra Harionov (Mobile: 40763528454)
Marius Sima (Mobile: 40722220823)
Gaushul Ansari (Mobile: 40731347728)
Uddeshya Priyadarshi (Mobile: 40724382287)