వడ్లను కేసీఆర్ కొనాల్సిందే: బండి సంజయ్
- వడ్ల కొనుగోలుపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి
- కేంద్రం రా రైస్ కొంటామన్నా రాష్ట్రం ఎందుకు కొనదు
- కేసీఆర్ సర్కారు తీరుపై బండి సంజయ్ నిప్పులు
యాసంగి వడ్లను కేసీఆర్ సర్కారు కొనాల్సిందేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రా రైస్ కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న బండి.. యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనని తేల్చి చెప్పారు. కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనమంటోందని ఆయన ప్రశ్నించారు. కామారెడ్డిలో శనివారం జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా బండి సంజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
వడ్ల కొనుగోలుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త పేచీలు పెడుతున్న కేసీఆర్.. వడ్లను కొనడం లేదని కేంద్రంపై నింద మోపడం తప్పించి..రాష్ట్ర రైతాంగాన్ని అయోమయంలో పడేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అయితే వడ్ల కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఇప్పటికే రైతుల్లో అవగాహన వచ్చిందని, ఈ యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుంటే బీజేపీ నేతృత్వంలో రైతుల సత్తా ఏమిటో కేసీఆర్‌కు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.