3 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి 'భీమ్లా నాయక్'

  • ఈ నెల 25న వచ్చిన 'భీమ్లా నాయక్'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • ఓవర్సీస్ లోను అదే దూకుడు 
  • ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల 5 లక్షల షేర్
పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' రూపొందింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మొదటి మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 52 కోట్ల 96 లక్షల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 25 కోట్ల 85 లక్షలను వసూలు చేసింది. యూఎస్ లో 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల 5 లక్షల షేర్ ను రాబట్టింది. అన్ని ప్రాంతాల్లోను ఇంకా అదే దూకుడును కొనసాగిస్తుండటం విశేషం. 

మార్చి 11న 'రాధే శ్యామ్' రంగంలోకి దిగేవరకూ 'భీమ్లా నాయక్'కి గట్టిపోటీ లేనట్టే. అందువలన వసూళ్ల పరంగా ఈ సినిమాకి ఇప్పట్లో పెద్దగా అడ్డంకులు లేనట్టే. దాంతో లాంగ్ రన్ లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 


More Telugu News