ఏపీలోనూ ఇంటర్ పరీక్షలు వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదిగో
- కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
- ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు
- జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నిర్ణయం
ఏపీలోనూ ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ మేరకు.. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఏపీ కూడా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పాత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉన్న పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా కొత్త షెడ్యూల్ ను రిలీజ్ చేశారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ ను మాత్రం ముందు ప్రకటించిన తేదీల్లోనే (మార్చి 11 నుంచి 31 వరకు) నిర్వహిస్తామని చెప్పారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని, 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్ లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఇన్విజిలేషన్ కు ఎలాంటి ఇబ్బందుల్లేవని, సరిపడా సిబ్బంది ఉన్నారని, పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలోనూ ఇబ్బందులు రావని ఆయన చెప్పారు.
ఇదీ షెడ్యూల్
అన్ని పరీక్షలను ఏప్రిల్ లో నిర్వహించనున్నా.. కొన్ని పరీక్షలను మాత్రం ఈ నెలలోనే నిర్వహిస్తున్నట్టు కొత్త షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ ను ఈ నెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ను ఈ నెల 9న ఉదయం 10 నుంచి ఒంటి గంట దాకా పెడతారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకే ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు చదివే వాళ్లకు కూడా ఇవే తేదీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. వారికి ప్రత్యేకంగా షెడ్యూల్ ఇస్తామని వెల్లడించింది.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు | |
---|---|
తేదీ–వారం | పేపర్ (సబ్జెక్ట్) |
22–04–2022 (శుక్రవారం) | పార్ట్ 2– సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 |
25–04–2022 (సోమవారం) | పార్ట్ 1– ఇంగ్లిష్ పేపర్ 1 |
27–04–2022 (బుధవారం) | పార్ట్ 3– గణితం పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1ఏ, సివిక్స్ పేపర్ 1 |
29–04–2022 (శుక్రవారం) | గణితం పేపర్ 1బీ, జువాలజీ పేపర్ 1, చరిత్ర పేపర్ 1 |
02–05–2022 (సోమవారం) | భౌతిక శాస్త్రం పేపర్ 1, ఆర్థిక శాస్త్రం పేపర్ 1 |
06–05–2022 (శుక్రవారం) | రసాయన శాస్త్రం పేపర్ 1, కామర్స్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్–మ్యూజిక్ పేపర్ 1 |
09–05–2022 (సోమవారం) | ప్రజా పద్దులు (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పేపర్ 1, లాజిక్ పేపర్ 1, గణితం బ్రిడ్జి కోర్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకోసం) |
11–05–2022 (బుధవారం) | మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, భూగోళ (జాగ్రఫీ) శాస్త్రం పేపర్ 1 |
ఇంటర్ సెకండియర్ పరీక్షలు | |
---|---|
తేదీ (వారం) | పేపర్ (సబ్జెక్ట్) |
23–04–2022 (శనివారం) | పార్ట్ 2– లాంగ్వేజ్ పేపర్ 2 |
26–04–2022 (మంగళవారం) | పార్ట్ 1– ఇంగ్లిష్ పేపర్ 2 |
28–04–2022 (గురువారం) | పార్ట్ 3– గణితం పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 |
30–04–2022 (శనివారం) | గణితం పేపర్ 2బీ, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 |
05–05–2022 (గురువారం) | భౌతిక శాస్త్రం పేపర్ 2, ఆర్థిక శాస్త్రం పేపర్ 2 |
07–05–2022 (శనివారం) | రసాయన శాస్త్రం పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్–మ్యూజిక్ పేపర్ 2 |
10–05–2022 (మంగళవారం) | ప్రజా పద్దులు పేపర్ 2, లాజిక్ పేపర్ 2, గణితం బ్రిడ్జి కోర్సు పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు) |
12–05–2022 (గురువారం) | మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 |