యుద్ధంలో పుతిన్.. స్విస్ కొండల్లో ప్రియురాలు!
- యుద్ధం మొదలైన తర్వాత తన కుటుంబాన్ని అణుబంకర్లలో దాచిపెట్టిన పుతిన్
- ప్రేయసి అలీనాతోపాటు నలుగురు పిల్లలకు పటిష్ఠ రక్షణ
- స్విస్ కొండల్లోని రహస్య ప్రదేశంలోని షాలేలో అలీనా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధ వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉంటే ఆయన ప్రియురాలు అలీనా కబయేవా స్విస్ కొండల్లో సేద తీరుతున్నారు. యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా పుతిన్ తన కుటుంబాన్ని అణుబంకర్లలో దాచి పెట్టారు.
అలాగే, స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తన ప్రేయసి, ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జిమ్నాస్ట్ అలీనాతోపాటు ఆమెతో తనకు జన్మించిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు. స్విస్ కొండల్లో అత్యంత సురక్షితమైన, రహస్యమైన ప్రాంతాల్లో చెక్కలతో నిర్మించిన కట్టడాల్లో (షాలే) వారిని దాచి ఉంచినట్టు తెలుస్తోంది.