ఉక్రెయిన్ కు అండగా ప్రపంచబ్యాంకు... భారీ ప్యాకేజీ ప్రకటన
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
- గత రెండు వారాలుగా దాడులు
- క్షీణించిన ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి
- 723 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రపంచబ్యాంకు
యుద్ధం ఏ దేశానికైనా తీవ్ర ఆర్థిక నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత రెండు వారాలుగా రష్యా దాడులతో ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచబ్యాంకు నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఉక్రెయిన్ కు భారీ ఆర్థిక ప్యాకేజీతో ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించింది.
ఈ ప్యాకేజీ విలువ 723 మిలియన్ డాలర్లు. అందుకు ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ కు ఈ సాయం ఊరట కలిగించనుంది.
ఈ ప్యాకేజీ విలువ 723 మిలియన్ డాలర్లు. అందుకు ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ కు ఈ సాయం ఊరట కలిగించనుంది.