కొత్త సినిమా వస్తే మాకు 100 టికెట్లు కావాలి... థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్
- పార్టీ నేతలు టికెట్లు కావాలంటున్నారన్న మేయర్
- టికెట్లకు రుసుం చెల్లిస్తామని వెల్లడి
- ఇకపై వచ్చే సినిమాలకు ఈ ఆనవాయతీ కొనసాగాలని స్పష్టీకరణ
ఏపీలో సినిమా టికెట్ల అంశం ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వం కొత్త జీవో తీసుకురావడంతో సినీ ప్రముఖులు, థియేటర్ యాజమాన్యాలు కొంత ఊరట పొందే పరిస్థితి నెలకొంది. అయితే, కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ థియేటర్ యాజమాన్యాలను విజయవాడ మేయర్ కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మేరకు విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని సినిమా హాళ్ల యాజమాన్యాలకు లేఖ రాశారు.
ప్రతి నెల కొత్త చిత్రాలు రిలీజ్ అవుతున్నాయని, అయితే టికెట్లు సమకూర్చాలంటూ పార్టీ ప్రతినిధులు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని మేయర్ పేర్కొన్నారు. అందువల్ల కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రతి షోకి 100 టికెట్లు పంపాలని మేయర్ తన లేఖలో స్పష్టం చేశారు. నిర్దేశించిన మేరకు టికెట్ రుసుం నగదు రూపంలో చెల్లిస్తామని కూడా మేయర్ పేర్కొన్నారు. ఇకపై విడుదలయ్యే కొత్త చిత్రాలకు ఈ మేరకు టికెట్లు పంపాలని కోరారు.
.