అందుకే ఆ పాత్రల కోసం ఎన్టీఆర్ - చరణ్ లను ఎంచుకున్నాను: రాజమౌళి

  • ఈ నెల 25వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్
  • ప్రమోషన్స్ లో బిజీగా రాజమౌళి
  • కథను బట్టే పాత్రలు నడుస్తాయి 
  • అభిమానులంతా ఆశించేలా ఉంటుందన్న రాజమౌళి      
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' విడుదలకి ముస్తాబవుతోంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి రాజమౌళి మాట్లాడారు. 

చరణ్ విషయానికి వస్తే ఆయనది సాధు స్వభావం. ఎంతటి భావావేశాన్ని అయినా ఆయన తనలో దాచుకోగలడు. అల్లూరిలోను అవే లక్షణాలు కనిపించాయి. అందువల్లనే ఆ పాత్రలో చరణ్ ను తీసుకున్నాను. ఇక ఎన్టీఆర్ చాలా అమాయకంగా కనిపిస్తాడు. ఏ మాత్రం ఆవేశం వచ్చినా వెంటనే బయటపడిపోతాడు. కొమరం భీమ్ పాత్రకి దగ్గరగా ఉండటం వలన ఆయనను తీసుకున్నాను. 

ఎన్టీఆర్ - చరణ్ పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. ఇతనికో పాట .. అతనికో ఫైటు అన్నట్టుగా నేను ఆ పాత్రలను ట్రీట్ చేయలేదు. కథను బట్టే ఆ పాత్రలు నడుస్తాయి. అభిమానుల వైపు నుంచి చూస్తూ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం మాత్రం కొంత కష్టమైంది" అని చెప్పుకొచ్చారు.


More Telugu News