"హిందీ మాట్లాడే సోదరులకు ఓ విజ్ఞప్తి" అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర ట్వీట్

  • అత్యున్నత భాషా పరిజ్ఞానం శశిథరూర్ సొంతం
  • నాణ్యమైన భాష మాట్లాడే కాంగ్రెస్ ఎంపీ
  • కేరళను కరేలా అన్నారంటూ అసంతృప్తి
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఆంగ్ల భాషా పరిజ్ఞానం అత్యున్నతస్థాయిలో ఉంటుంది. చాలామందికి తెలియని ఆంగ్ల పదాలను, అత్యంత క్లిష్టమైన స్పెల్లింగులతో ఉండే పదాలను కూడా ఆయన తన వ్యాఖ్యల్లో ఉపయోగిస్తుంటారు. శశిథరూర్ కేరళీయుడున్న సంగతి తెలిసిందే. 

అలాంటి వ్యక్తి తన సొంత రాష్ట్రం పేరును ఎవరైనా తప్పుగా రాస్తే ఎలా భరించగలడు? అందుకే ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు. "హిందీ మాట్లాడే కొందరు సోదరులకు విజ్ఞప్తి. దీన్ని Kerala (కేరళ) అని రాయాలి. Karela (కాకరకాయ) అని కాదు. అంతేకాకుండా, మేం పొట్ల, కాకర, సొరకాయల (Gourd) సామ్రాజ్యానికి చెందినవాళ్లం కాదు" అంటూ చమత్కరించారు.

ప్రకృతి అందాల దృష్ట్యా కేరళను God's own country (దేవుడి సొంత దేశం)గా భావిస్తుంటారు. ఈ అంశాన్ని కూడా శశిథరూర్ తన ట్వీట్ లో వ్యంగ్యం ఉట్టిపడేలా ప్రస్తావించారు. అయితే కేరళను కరేలా అన్నది ఎవరో ఆయన వెల్లడించలేదు. మొత్తానికి అవతలి వ్యక్తి ఉత్తరాదికి చెందినవాడన్న విషయం మాత్రం అర్థమవుతోంది.


More Telugu News