కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ... ఏపీపై ఫిర్యాదులు
- ఏపీ ఎత్తిపోతల పథకాలపై ఫిర్యాదులు
- తుంగభద్ర జలాలు తీసుకుంటోందని వెల్లడి
- ఏపీని కట్టడి చేయాలని విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇప్పట్లో సమసిపోయేట్టు కనిపించడంలేదు. తాజాగా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు. తుంగభద్ర జలాల కోసం ఏపీ నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఏపీ ఎత్తిపోతల పథకాలు నిర్మించిందని వివరించారు. రాఘవేంద్ర, మరో 12 ఎత్తిపోతల పథకాలను ఏపీ తుంగభద్రపై నిర్మించిందని వివరించారు. ఎత్తిపోతలకు తుంగభద్ర జలాలు తీసుకోకుండా ఏపీని నిలువరించాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.