నడిరోడ్డుపై తల్లి ఒడిలో టెన్త్ విద్యార్థిని మృతి.. నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్
- మారేడుమిల్లి ఆశ్రమ పాఠశాలలో టెన్త్ చదువుతున్న సుమిత్ర
- అనారోగ్యంతో బొదలూరు ఆసుపత్రిలో చికిత్స
- రోగం నయం కాకుండానే డిశ్చార్జీ
- జగన్ సర్కారు నిర్లక్ష్యమే కారణమన్న నారా లోకేశ్
ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలిక నడిరోడ్డుపై తల్లి ఒడిలోనే కన్నుమూసిన వైనం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన భావోద్వేగపూరితంగా స్పందించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే రోగం నయం కాకుండానే ఇంటికి పంపేసిన వైద్యుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం వరుసగా పోస్ట్ చేసిన ట్వీట్లలో జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరిపై విరుచుకుపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుమిత్ర అనారోగ్యానికి గురైతే.. బోదలూరు పీహెచ్‌సీలో చికిత్స అందించిన వైద్యులు.. ఆమెను మెరుగైన వైద్యం కోసం కాకినాడ వైద్యశాలకు తరలించకుండా ఇంటికి పంపేశారట. ఈ క్రమంలో తల్లి వెంట ఇంటికి బయలుదేరిన సుమిత్ర నడిరోడ్డుపై తల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఈ ఘటన తెలిసిన వెంటనే లోకేశ్ స్పందించారు. జగన్ మోసపు రెడ్డి మాటలు సుమిత్రను తిరిగి తీసుకురాగలవా? అని లోకేశ్ ప్రశ్నించారు.