నెట్ ఫ్లిక్స్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కామెడీ షోలు
- రాజకీయాల్లోకి రాకముందు టీవీ షోలు చేసిన జెలెన్ స్కీ
- అనేక సినిమాల్లోనూ నటించిన వైనం
- బాగా పేరు తెచ్చిన 'సర్వెంట్ ఆఫ్ ద పీపుల్'
- అందులో దేశాధ్యక్షుడిగా నటించిన జెలెన్ స్కీ
రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ శాంతి, ధైర్యం, దేశభక్తి వంటి అంశాలకు ప్రతీకగా నిలుస్తున్నారు. జెలెన్ స్కీ ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలకు ఓ హీరో. వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి రాకముందు కమెడియన్. లా చదివిన జెలెన్ స్కీ ఓ రష్యా టీవీ షోలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం తన చిన్ననాటి స్నేహితులతో కలిసి క్వర్టాల్-95 అనే ఎంటర్టయిన్ మెంట్ సంస్థను స్థాపించారు. టీవీ షోలు, కార్టూన్లనే కాదు, ఈ సంస్థ సినిమాలు కూడా నిర్మించింది.
ఇక అనేక వినోద కార్యక్రమాల్లో జెలెన్ స్కీ కమెడియన్ గా నటించారు. అంతేకాదు, పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. కాగా, రష్యా దురాక్రమణ నేపథ్యంలో జెలెన్ స్కీ ఇప్పుడు వరల్డ్ వైడ్ పాప్యులారిటీ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. జెలెన్ స్కీ గతంలో నటించిన అనేక టీవీ షోలు, కామెడీ సిరీస్ లను మళ్లీ ప్రసారం చేయనుంది.
ముఖ్యంగా, జెలెన్ స్కీ నటించిన 'సర్వెంట్ ఆఫ్ ద పీపుల్' సిరీస్ ను ప్రసారం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో జెలెన్ స్కీ దేశాధ్యక్షుడి పాత్ర పోషించడం విశేషం. ఈ సెటైరికల్ కామెడీ సిరీస్ 2015లో వచ్చింది. ఇందులో జెలెన్ స్కీ ఓ టీచర్ నుంచి దేశాధ్యక్షుడిగా మారడం చూడొచ్చు.