సరికొత్త రికార్డు... రూ.44 వేలు పలికిన మిర్చి!
- దేశీయ రకానికి రూ.44 వేలు
- సింగిల్ పట్టీకి రూ.42,500
- ఎనుమాముల మార్కెట్‌లో సరికొత్త రికార్డు
మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్వింటా మిర్చి ధర ఈ దఫా ఏకంగా రూ.44 వేల మార్కును దాటింది. ఈ మేరకు గురువారం వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌లో దేశీయ రకం మిర్చికి రూ.44 వేల ధర దక్కింది. సింగిల్ పట్టీ రకం మిర్చి కూడా రికార్డు స్థాయిలో రూ.42,500 ధర పలికింది.
మిర్చి పంటకు తెగులు సోకడం, దిగుబడి తగ్గిపోవడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతోనే ఈ తరహాలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయని ఎనుమాముల మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మిర్చి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని కూడా వారు తెలిపారు.