ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో ఆప్ పాదయాత్రలు.. ప్రారంభించనున్న అరవింద్ కేజ్రీవాల్!
- పంజాబ్ జోష్ తో దక్షిణాదిపై ఆప్ దృష్టి
- అన్ని నియోజకవర్గాల్లో ఆప్ పాదయాత్ర
- అంబేద్కర్ జయంతి రోజునే మొదలు
- ఏర్పాట్లు చేస్తున్న పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ
పంజాబ్ ఫలితాలిచ్చిన జోష్ తో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశంలోని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దక్షిణాదిలోనూ పాగా వేసేందుకు కసరత్తులను చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమైంది.
అందుకోసం పాదయాత్ర చేసేందుకు కసరత్తులు చేస్తోంది. దాని కోసం త్వరలోనే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయని, ఆయన స్వయంగా పాదయాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు.
వచ్చే నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్రను ఆయన ప్రారంభిస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పాదయాత్రలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
కాగా, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడ పట్టుకోసం సోమ్ నాథ్ భారతిని.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఇప్పటికే కేజ్రీవాల్ నియమించారు. రెండు మూడుసార్లు తెలంగాణ ప్రభుత్వ తీరుపైనా సోమ్ నాథ్ భారతి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు.