పెగాసెస్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చెప్పారు: అయ్యన్న పాత్రుడు
- చంద్రబాబు హయాంలో పెగాసెస్ కొనుగోలు చేశారన్న మమతా బెనర్జీ
- ఏపీలో కలకలం రేపుతున్న మమత వ్యాఖ్యలు
- మమత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్న లోకేశ్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసెస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారని అసెంబ్లీ వేదికగా ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని గతంలో డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసిన విషయాన్ని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సమాచారహక్కు చట్టం కింద సేకరించిన పత్రాన్ని విడుదల చేశారు.
మరోవైపు నారా లోకేశ్ ఈ అంశంపై స్పందిస్తూ... బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్టే స్పైవేర్ ను కొనుగోలు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు తమ ప్రభుత్వాన్ని సంప్రదించారని... అయితే, ఆ సాఫ్ట్ వేర్ ను తాము కొనుగోలు చేయలేదని చెప్పారు. మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని అన్నారు.