కరోనా కొత్త వేరియంట్లు రావొచ్చు.. జాగ్రత్త: హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ

  • కరోనా వైరస్ పూర్తిగా క్షీణించలేదు
  • సీజనల్ వ్యాధిలా ఇంకా మారలేదు
  • సమూలంగా కట్టడి చేసే చర్యలు చేపట్టకుంటే ప్రమాదమే
  • డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా వైరస్ కొన్ని దేశాలను మళ్లీ వణికిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. వైరస్ ఇంకా బలంగానే ఉందని, మున్ముందు మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. 

వైరస్ పూర్తిగా క్షీణించలేదని, సీజనల్ వ్యాధిలా మారలేదని స్పష్టం చేసింది. మున్ముందు మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా తగ్గుముఖం పట్టిందని, కాబట్టి సులభంగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు. 

యూకే, దక్షిణ కొరియాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో వైరస్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిన తర్వాత అక్కడి నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇది చేరుకుంటుందన్నారు. కాబట్టి దానిని సమూలంగా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టకపోతే మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.


More Telugu News