విప‌త్తు నిధుల‌ను మ‌ళ్లించిన ఏపీ: కేంద్రం ప్ర‌క‌ట‌న‌

  • రాష్ట్ర విప‌త్తు నిధికి కేంద్రం వాటాగా రూ.324.15 కోట్లు
  • జాతీయ విప‌త్తు నిధి కింద రూ.570.91 కోట్ల విడుద‌ల‌
  • ఈ రెండు నిధుల‌ను అగ్రిక‌ల్చ‌ర్‌కు త‌ర‌లించిన ఏపీ
  • ఏపీ అవ‌క‌త‌వ‌క‌ల‌ను కాగ్ నిర్ధారించిందన్న కేంద్రం
ఏపీ ప్ర‌భుత్వం నిధుల వ్య‌యంలో నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తేల్చింది. ఓ ప్ర‌త్యేక ప‌ని కోసం కేటాయించిన నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇత‌ర‌త్రా కార్య‌క‌లాపాల‌కు వినియోగిస్తోంద‌ని పేర్కొన్న కేంద్రం.. దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఆర్ధిక నిబంధనలను ఉల్లంఘించిన‌ట్టుగానే ప‌రిగ‌ణిస్తున్నామ‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు కాగ్ నివేదిక ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర్ధారించిందని కేంద్రం తెలిపింది.  

రాష్ట్ర విపత్తు నిధికి కేంద్రం వాటాగా రూ.324.15 కోట్లు, జాతీయ విప‌త్తు నిధి కింద రూ.570.91 కోట్ల‌ను ఏపీకి విడుద‌ల చేసిన‌ట్టు కేంద్రం తెలిపింది. ఈ నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం నిర్దేశిత ప‌నుల కోసం కాకుండా ఆ రెండు ఖాతాల మొత్తం రూ.1,100 కోట్ల‌ను రాష్ట్ర డైరెక్ట‌ర్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్‌కు మళ్లించింద‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌ని కేంద్రం తెలిపింది.


More Telugu News