గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ. 50 పెంపు.. నేటి నుంచే అమలులోకి!
- గృహ, కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసిన ప్రభుత్వం
- తెలంగాణ, ఏపీలో వెయ్యి దాటేసిన సిలిండర్ ధర
- 5 కేజీల సిలిండర్ ధర రూ. 349కి పెంపు
నేటి ఉదయం జనం ఇంకా పక్కల మీది నుంచి లేవకముందే కేంద్రం షాకిచ్చింది. వంటగ్యాస్ ధరలను భారీగా పెంచేసింది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 పెంచేసింది. ఫలితంగా తెలంగాణలో సిలిండర్ రూ. 1,002కి చేరుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది రూ. 1008గా ఉంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి.
5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349కి పెరగ్గా, 10 కేజీల కాంపోజిట్ బాటిల్ ధర రూ. 669కి చేరింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 2033.50కి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో గ్యాస్ ధరలు పెరగడం అక్టోబరు తర్వాత ఇదే తొలిసారి.