పుతిన్ ప్రకటనకు అరగంట ముందే ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ మొదలైందట!
- ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా
- పుతిన్ ప్రకటనకు అరగంట ముందే తుపాకీతో సరిహద్దు దాటిన రష్యన్ సైనికుడు
- సీసీటీవీ కెమెరాలో కనిపించిన సన్నివేశం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి సరిగ్గా నెల రోజులు అయింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే, పుతిన్ అధికారికంగా ప్రకటించడానికి 30 నిమిషాల ముందే చైనా దురాక్రమణ మొదలయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పుతిన్ ప్రకటనకు అరగంట ముందే ఓ రష్యన్ సైనికుడు తుపాకీతో క్రిమియా సరిహద్దును దాటినట్టు సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. సైనిక చర్య మొదలైన తర్వాతే పుతిన్ దానిపై అధికారిక ప్రకటన చేశారని సదరు కథనాల్లో పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై ఇంకా పట్టు దొరక్కపోవడంతో ఇతర నగరాలపై రష్యా సేనలు దృష్టి సారించాయి. మేరియుపోల్ నగరంలో దాదాపు 90 శాతం భవనాలు ధ్వంసమైపోయాయి. మరోవైపు ఉక్రెయిన్ బలగాలు కూడా రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నాయి. వేలాది మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు మట్టుపెట్టాయి. 7 వేల నుంచి 15 వేల మంది రష్యాన్ సైనికులు చనిపోయి ఉండొచ్చని నాటో అంచనా వేస్తోంది. అయితే రష్యా మాత్రం తమకు జరిగిన నష్టంపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.