తెలంగాణ‌లో విద్యుత్ ఛార్జీల పెంపుపై రేపు బీజేపీ నిర‌స‌న‌

  • పెట్రో ధరల పెంపుపై గురువారం టీఆర్ఎస్ నిర‌స‌న‌లు
  • విద్యుత్ ఛార్జీల పెంపుపై శుక్ర‌వారం బీజేపీ ఆందోళ‌న‌లు
  • బీజేపీ రాష్ట్ర శాఖ నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరుకు నిర‌స‌న‌గా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తే.. శుక్ర‌వారం నాడు విద్యుత్ చార్జీల‌ను పెంచుతూ టీఆర్ఎస్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా బీజేపీ ఆందోళ‌న బాట ప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు గురువారం బీజేపీ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపున‌కు నిర‌స‌న‌గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు బీజేపీ తెలిపింది. విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించేదాకా బీజేపీ పోరు ఆగ‌ద‌ని స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో ఆ పార్టీ స్పష్టం చేసింది.


More Telugu News