కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీ వాసి బైక్ యాత్ర
- గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బాలరాజు గౌడ్
- కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ యాదాద్రికి బైక్ యాత్ర
- మాచర్ల ఎమ్మెల్యే కూడా అనుమతినిచ్చినట్టు వెల్లడి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన సొంతూరు నుంచి తెలంగాణలోని యాదాద్రి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బాలరాజు గౌడ్‌కు కేటీఆర్ అంటే ఇష్టమట. తన అభిమాన నేత సీఎం కావాలని కోరుతూ బాలరాజు గౌడ్ బైక్‌పై యాత్రగా యాదాద్రికి బయలుదేరారు.
ఈ యాత్ర గురించి తాను తమ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని బాలరాజు గౌడ్ తెలిపారు. ఈ యాత్రకు ఎమ్మెల్యే కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పిన బాలరాజు గౌడ్.. కేటీఆర్ సీఎం కావాలంటూ యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏదైతేనేం.. కేటీఆర్ అంటే తనకు అభిమానమని, తన అభిమాన నేత సీఎం కావాలని కోరుకోవడంలో తప్పేముందని కూడా బాలరాజు గౌడ్ ప్రశ్నిస్తున్నారు.