పక్క‌దారి ప‌ట్టిన నిధుల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి: య‌న‌మ‌ల డిమాండ్‌

  • ఏపీలో రూ.48 వేల కోట్లు ప‌క్క‌దారి మ‌ళ్లిన‌ట్లు టీడీపీ ఆరోప‌ణ‌
  • కాగ్ నివేదిక‌లోనూ ఇదే అంశం తేలింద‌న్న య‌న‌మ‌ల‌
  • ఈ నిధుల్లో మెజారిటీ వాటా కేంద్రానిదేన‌ని వ్యాఖ్య  
  •  
ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు పాల‌న‌లో ఇప్ప‌టిదాకా ఖ‌ర్చు అయిన నిధుల్లో రూ.48 వేల కోట్ల‌కు అస‌లు లెక్క‌లే లేవ‌ని విప‌క్ష టీడీపీ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని తొలుత టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశాన్ని శ‌నివారం ప్ర‌స్తావించిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు.. ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేశారు.

ప‌క్క‌దారి ప‌ట్టిన నిధుల్లో మెజారిటీ వాటా కేంద్రం నుంచి వ‌చ్చిన‌వేన‌ని చెప్పిన య‌న‌మ‌ల‌.. ఈ అవక‌త‌వ‌క‌ల‌ను తేల్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వ‌మే సీబీఐ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌క్క‌దారి పట్టిన నిధులు ఎవ‌రి చేతుల్లోకి వెళ్లాయ‌నే అంశాన్ని తేల్చాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని కూడా య‌న‌మ‌ల గుర్తు చేశారు.


More Telugu News