డుప్లెసిస్ విశ్వరూపం, డీకే మెరుపు ఇన్నింగ్స్... బెంగళూరు భారీ స్కోరు
- బెంగళూరు వర్సెస్ పంజాబ్
- మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
- 20 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగులు
- 57 బంతుల్లో 88 పరుగులు చేసిన డుప్లెసిస్
- 14 బంతుల్లోనే 32 పరుగులు సాధించిన దినేశ్ కార్తీక్
- రాణించిన కోహ్లీ
పంజాబ్ కింగ్స్ తో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెంగళూరు కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆకాశమే హద్దులా చెలరేగిపోయాడు. ఓపెనర్ గా వచ్చిన డుప్లెసిస్ పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సులు, ఫోర్లు సునాయాసంగా కొట్టాడు. మొత్తం 57 బంతులాడిన డుప్లెసిస్ 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేశాడు. అర్షదీప్ బౌలింగ్ లో ఓ భారీ షాట్ కొట్టే యత్నంలో షారుఖ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఇక, మాజీ కెప్టెన్ కోహ్లీ వేగంగా ఆడి 29 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (డీకే) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు 200 మార్కు దాటింది. దినేశ్ కార్తీక్ కేవలం 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 32 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ అనుజ్ రావత్ 21 పరుగులు చేసి రాహుల్ చహర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.