ఏపీలోని పలు జిల్లాలకు వడగాడ్పుల హెచ్చరిక

  • వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు
  • పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • ఎండలకు తోడు వడగాడ్పులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ శాఖ
ఏపీలో వేసవి ఆరంభంలోనే వడగాడ్పులు రంగప్రవేశం చేస్తున్నాయి. రేపు (మార్చి 29) పలు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మంగళవారం నాడు విజయనగరం జిల్లా కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 17 జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. 

కృష్ణా జిల్లాలో 12 మండలాలు, విశాఖ జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 14, శ్రీకాకుళం జిల్లాలో 7, కర్నూలు జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, కడప జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.


More Telugu News