చంద్రబాబుతో స్నేహంపై సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
- వామపక్షాలకు దక్కాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ ఎగరేసుకెళ్లారు
- పార్టీల మధ్య శత్రుత్వం ఉండకూడదు
- జగన్‌కు చంద్రబాబుతో పోలికే లేదన్న సీపీఐ నారాయణ
- చంద్రబాబుతో స్నేహాన్ని రైలు పట్టాలతో పోల్చిన వైనం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడులపై సోమవారం ఆసక్తికర కామెంట్లు చేశారు. టీడీపీ స్థాపించి 40 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీ భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సందర్భాన్ని, ఇప్పటి రాజకీయాలను ప్రస్తావిస్తూ నారాయణ ఆసక్తికర కామెంట్లు చేశారు.
1983లో కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కమ్యూనిస్టులకు రావాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ ఎగురేసుకెళ్లారని నారాయణ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చింది ఎన్టీఆరేనని కూడా నారాయణ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదంటూ ఆయన ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక చంద్రబాబుతో తన స్నేహం గురించి నారాయణ వివరిస్తూ.. ఆయనతో తన స్నేహం రైలు పట్టాల వంటిదని, రైలు పట్టాలు ఎప్పుడూ కలవవని, విడిపోవని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబుతో అసలు పోలికే లేదని కూడా నారాయణ వ్యాఖ్యానించారు. పార్టీల మధ్య శత్రుత్వం ఉండకూడదని చెప్పిన నారాయణ... ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.