ప‌ద్మావ‌తి నిల‌యంలో క‌లెక్ట‌రేట్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిష‌న్‌

  • ప‌ద్మావ‌తి నిల‌యంలో క‌లెక్ట‌రేట్ వద్దంటూ పిటిష‌న్‌
  • ఇప్ప‌టికే హైకోర్టులో ఈ వివాదంపై రెండు సార్లు విచార‌ణ‌
  • సింగిల్ జ‌డ్జి తీర్పును కొట్టేసిన డివిజ‌న్ బెంచ్‌
  • డివిజ‌న్ బెంచ్ తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంలో పిటిష‌న్‌
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జ‌గ‌న్ స‌ర్కారు వ‌డివ‌డిగానే అడుగులు వేస్తోంది. ఇలాంటి త‌రుణంలో తిరుప‌తి కేంద్రంగా కొత్త ప్ర‌స్థానం మొద‌లుపెట్ట‌నున్న శ్రీబాలాజీ జిల్లాకు సంబంధించిన క‌లెక్ట‌రేట్ వ్య‌వ‌హారంపై సోమ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లైంది. టీటీడీ ఆస్తిగా ఉన్న ప‌ద్మావ‌తి నిల‌యంలో బాలాజీ జిల్లా కలెక్ట‌రేట్ ఏర్పాటును నిలువ‌రించాలంటూ ఈ పిటిష‌న్‌ను బీజేపీ నేత‌, టీటీడీ పాల‌క‌మండ‌లి మాజీ స‌భ్యుడు భానుప్ర‌కాశ్ రెడ్డి దాఖ‌లు చేశారు.

ప‌ద్మావ‌తి నిల‌యంలో క‌లెక్ట‌రేట్ ఏర్పాటు వ‌ద్దంటూ ఇప్ప‌టికే దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి పిటిష‌న‌ర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌లో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ప‌ద్మావ‌తి నిల‌యంలోనే క‌లెక్ట‌రేట్ ఏర్పాటుకు అనుమ‌తి ఇస్తూ తీర్పు వ‌చ్చింది. తాజాగా ఈ తీర్పును స‌వాల్ చేస్తూ భాను ప్ర‌కాశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై ఏప్రిల్ 1న సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.


More Telugu News