కర్ణాటకలో హిజాబ్ ధ‌రించి ప‌రీక్ష రాసిన విద్యార్థినులు.. అనుమ‌తించినందుకు ఏడుగురు టీచ‌ర్ల‌పై స‌స్పెన్ష‌న్‌

  • క‌ర్ణాట‌క‌లో గదగ్‌లోని బ‌డుల్లో ఘ‌ట‌న‌
  • ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు హిజాబ్‌తో హాజ‌రైన‌ విద్యార్థినులు 
  • ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లపై కూడా సస్పెన్ష‌న్ వేటు
క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా, గదగ్‌లోని సీఎస్‌ పాటిల్‌ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్‌ పాటిల్‌ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు కొంద‌రు విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి వ‌చ్చి, రాశారు. దీంతో హిజాబ్ ధ‌రిస్తే ఎందుకు అనుమ‌తించార‌ని ప్ర‌శ్నిస్తూ ఏడుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్ష‌న్ వేటు వేశారు. 

అంతేకాదు, ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లపై కూడా సస్పెన్ష‌న్ వేటు పడింది. కాగా, కర్ణాటక విద్యాల‌యాల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొన్ని రోజుల క్రితం కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే.


More Telugu News