కుప్ప‌కూలిన కోల్ క‌తా.. బెంగ‌ళూరు ల‌క్ష్యం 129 ప‌రుగులు

  • బంతితో రెచ్చిపోయిన బెంగ‌ళూరు బౌల‌ర్లు
  • ట‌ప‌ట‌పా రాలిపోయిన కోల్‌క‌తా వికెట్లు
  • హ‌స‌రంగాకు 4 వికెట్లు
  • బెంగ‌ళూరు ల‌క్ష్యం 129 ప‌రుగులు
తాజా ఐపీఎల్ సీజ‌న్‌లో రికార్డులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు చెత్త రికార్డును భుజాన‌కెత్తుకోగా.. తాజాగా బుధ‌వారం నాటి మ్యాచ్‌లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కూడా అదే దిశ‌గా సాగుతోంది. బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్ క‌తా బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. దీంతో పూర్తి స్థాయి ఓవ‌ర్లు ఆడ‌కుండానే 18.5 ఓవ‌ర్లలోనే కోల్ క‌తా త‌న ఇన్నింగ్స్‌ను 128 ప‌రుగుల‌కే ముగించేసింది.

టాస్ గెలిచిన బెంగళూరు జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుని కోల్ క‌తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌క‌తా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రెహానే, వెంక‌టేశ్ అయ్య‌ర్‌లు స్వ‌ల్ప స్కోరుకే అవుట‌య్యారు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కోల్ క‌తా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 13 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. ఈ క్ర‌మంలో కోల్ క‌తా త‌ర‌ఫున ఒక్క‌రు కూడా క్రీజులో కుదురుకోలేక‌పోయారు. వెర‌సి 128 ప‌రుగుల‌కే కోల్‌క‌తా త‌న ఇన్నింగ్స్‌ను ముగించేసింది. 

ఇక బంతుల‌తో రెచ్చిపోయిన బెంగ‌ళూరు బౌల‌ర్లు కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌ను ఏమాత్రం కుదురుకోనీయ‌కుండా ప‌క‌డ్బందీగా బౌలింగ్ చేశారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌స‌రంగా ఏకంగా 4 వికెట్లు తీసుకోగా..ఆకాశ్ దీప్ 3 వికెట్లు, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ 2 వికెట్లు తీసుకున్నారు.


More Telugu News