"సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ కనెక్షన్" నుంచి కేటీఆర్కు ఆహ్వానం
- మే 1 నుంచి 4 వరకు సదస్సు
- మిల్కెన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సదస్సు
- లాస్ఏంజెలిస్లో సదస్సు నిర్వహణ
- సదస్సులో పాల్గొనాలంటూ కేటీఆర్కు ఆహ్వానం
అమెరికా వేదికగా జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలంటూ ఆ సదస్సు నిర్వాహకులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపారు. మే నెల 1 నుంచి 4 వరకు జరగనున్న ఈ సదస్సుకు అమెరికాలోని లాస్ ఏంజెలిస్ వేదిక కానుంది. అమెరికాకు చెందిన మిల్కెన్ ఇన్స్టిట్యూట్ ఈ సదస్సును నిర్వహిస్తోంది.
సెలబ్రేటింగ్ ద పవర్ ఆప్ కనెక్షన్ పేరిట మిల్కెన్ ఇన్ స్టిట్యూట్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు హాజరుకావాలని, కీలక ప్రసంగం ఇవ్వాలంటూ ఇన్స్టిట్యూట్ అధికారులు కేటీఆర్కు ఆహ్వానం పంపారు. ఇటీవలే వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన కేటీఆర్.. ఈ సదస్సు నిర్వాహకుల ఆహ్వానంపై ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.