నగరి నియోజకవర్గానికి వందేళ్లకు సరిపడా వరం ఇచ్చారు.. జగన్ అన్నకి థ్యాంక్యూ: రోజా
- కొత్త జిల్లాల ఏర్పాటులో జగన్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు
- ప్రజలు కోరినట్టు రెండు జిల్లాల్లో నా నియోజకవర్గం
- చంద్రబాబు 14 ఏళ్లలో తన కుప్పాన్ని కూడా రెవెన్యూ డివిజన్ చెయ్యలేదు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. చిత్తూరు జిల్లాలో నగరితో పాటు గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ఉండడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో సీఎం జగన్ తమ నగరి నియోజవర్గానికి వందేళ్లకు సరిపడా వరం ఇచ్చారని రోజా అన్నారు. 'ప్రజలు కోరినట్టు రెండు జిల్లాల్లో నా నియోజకవర్గం చేర్చినందుకు జగన్ అన్నకి థ్యాంక్యూ. చంద్రబాబు 14 ఏళ్లలో తన కుప్పాన్ని కూడా రెవెన్యూ డివిజన్ చెయ్యలేకపోయారు. కానీ సీఎం జగన్ అది చేసి చూపించారు' అని రోజా ఓ వీడియో పోస్ట్ చేశారు. 50 ఏళ్ల పాటు జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడికి, జగన్ కు ఉన్న తేడా అని ఆమె అన్నారు.