అమెరికాకు పోయి ఉద్యోగం చేసుకో: కేటీఆర్ పై ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు

  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు
  • కేటీఆర్ కు ముడి బియ్యం, రీసైక్లింగ్ బిజినెస్ ఉంది
  • తెలంగాణకు కేటీఆర్ పెద్ద భారమన్న అర్వింద్ 
తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన కేసీఆర్.. ఆ తప్పును కవర్ చేసుకునేందుకు దాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లక్షల కోట్లతో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... రైతుల సంక్షేమం కోసం రూ. 1,000 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోతోందని ప్రశ్నించారు. 

వడ్లు కొనుగోలు విషయంపై టీఆర్ఎస్ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కేటీఆర్ కు ముడి బియ్యం, రీసైక్లింగ్ బిజినెస్ ఉందని... అందువల్లే ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగిలాయని... కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానేసి, అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. కేటీఆర్ సిల్లీ ఫెలో అని, తెలంగాణకు ఆయన పెద్ద భారమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News